ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఇవే

By | November 11, 2020

మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ పాలనని సాగిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ముఖ్యంగా కరోనా కాస్త కాలం లో ఆయన ప్రజల కోసం చేపట్టిన జాగ్రత్త చర్యలు దేశం లో ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యలేదు అనే చెప్పాలి, ఇతర రాష్ట్ర ముఖ్య మంత్రులు కూడా మన జగన్ గారి ఆలోచనలు వాళ్ళ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు అంటే ఆయన పాలన ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు అన్ని తూచా తప్పకుండ అమలు చేస్తూనే ఇవ్వని హామీలు కూడా అమలు పరుస్తూ తండ్రిని మించిన తనయుడు గా ప్రజల మన్ననలు పొందుతున్నారు, తప్పు చేస్తే సొంత పార్టీ నాయకులను కూడా శిక్షించే నైజం ఉన్నోడు జగన్ మోహన్ రెడ్డి, తనకి ఓటు వేసిన వారికే కాకుండా ఓటు వెయ్యని వారికి కూడా తానూ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నాడు అంటే ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు, అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడీ తీసుకున్న మరో సంచలన నిర్ణయం రాష్ట్రం లో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రం లో కొత్త జిల్లాలు ఏర్పాటు చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది , ఈ ప్రక్రియ పంచాయితీ ఎన్నికలు ప్రారంభం అయ్యేలోపే పూర్తి అవ్వాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేసాడు అట, ఇందుకోసం ఒక్క కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం, తొలుత 25 కొత్త జిల్లాలను ఏర్పాటు చెయ్యాలి అని అనుకున్న , కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు అన్ని పరిశీలించిన తర్వాత 32 జిల్లాలు ఏర్పాటు చెయ్యాలి అనే నిరయానికి వచ్చినట్టు తెలుస్తోంది, దీనిపై ప్రస్తుతం జగన్ నాలుగు కమిటీలను మళ్ళీ వేసినట్టు తెలుస్తుంది, జిల్లాలోని సరిహద్దులు , నియంత్రణ మరియు లీగల్ వ్యవహారాల కోసం ఒక్క కమిటీ, నిర్మాణాత్మక మరియు పునర్విభజన మద్యానికి మరో కమిటీ, ఆస్తులు మరియు మెలిక సదుపాయాల అధ్యాయానికి మరో కమిటీ , ఇక ఐటీ సంబంధిత పనుల అధ్యాయానికి మరో సబ్ కమిటీ ఇలా నాలుగు కమిటీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నియమించారు.

ఇక సోషల్ మీడియా లో బాగా ప్రచారం అవుతున్న కొత్త జిల్లాల జాబితాలోకి వస్తే ముందుగా ఉత్తరాంధ్ర లోని పలాస , శ్రీకాకుళం, పార్వతీపురం , అరకు ,విశాఖపట్నం , విజయనగరం మరియు అనకాపల్లి వంటి ప్రాంతాలను జిల్లాలుగా మార్చబోతున్నట్టు తెలుస్తోంది , ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ , రాజముండ్రి మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుండి నర్సాపురం వంటి ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా చెయ్యబోతున్నారు అట, ఇక కృష్ణ జిల్లా నుండి మచిలీపట్టణం మరియు విజయవాడ అలాగే గుంటూరు జిల్లా నుండి అమరావతి ,గుంటూరు, బాపట్ల, నర్సారావు పేట మరియు మార్కాపురం వంటి ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చెయ్యబోతున్నట్టు సమాచారం, ఇక ప్రకాశం జిల్లా నుండి ఒంగోలు , నెల్లూరు జిల్లా నుండి నెల్లూరు మరియు గూడూరు వంటి ప్రాంతాలు ప్రత్యేకమైన జిల్లాలుగా అవతరించబోతున్నాయి, ఇక రాయలసీమ నుండి చిత్తూరు ,తిరుపతి , మదనపల్లె , హిందూపురం ,అనంతపురం , ఆదోని , కర్నూలు , నంద్యాల ,కడప మరియు రాజంపేట వంటి ప్రాంతాలు ప్రత్యేకమైన జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి అని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతున్నాయి, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరుకు వేచి చూడాల్సిందే.

One thought on “ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఇవే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *