చిరంజీవి గురించి మోహన్ బాబు మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నెలు ఆపుకోలేరు

By | November 10, 2020

కరోనా మహమ్మారి దాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు ఎలా తల్లడిల్లిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎంతో మంది పేద ప్రజల బ్రతుకుల్లో చీకటిని నింపిన ఈ మహమ్మారి దాటి నుండి ఇప్పటికి ఎవ్వరు కోలుకోలేక ఉన్నారు, సామాన్య మధ్య తరగతి కుటుంబాలు కరోనా సోకి దానికి సరైన చికిత్స చేయించుకోలేక చనిపోతుండడం మన అందరం చూసాము, కానీ వేల కోట్ల రూపాయలకు అధిపతులు అయినా ఎంతో మంది ప్రముఖ పారిశ్రామిక వెతలు , రాజకీయ నాయకులూ మరియు సినీ ప్రముఖులు కూడా ఈ కరోనా మహమ్మారి భారిన పడి ప్రాణాలను విడుస్తున్నారు అంటే ఇది ఎంత డేంజరస్ వైరస్ అనేది మన అందరం అర్థం చేసుకోవచ్చు, ఇటీవల కాలం లో గాన గంధర్వుడు ఎస్ పీ బాల సుబ్రహ్మణ్యం గారు కరోనా భారిన పడి తన ప్రాణాలను విడిచిన సంగతి మన ఘటన మన అందరిని ఎలా దిగ్బ్రాంతికి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ తర్వాత ప్రముఖ హీరో రాజశేఖర్ కూడా కరోనా భారిన పడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది, ఇప్పుడు లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా భారిన పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిరంజీవి అభిమానులకు గుండె ఆగిపొయ్యెలా చేసింది.

ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి కరోనా సోకింది అనే వార్త తెలియగానే ఆయన చిరకాల మిత్రుడు మంచు మోహన్ బాబు తల్లడిల్లిపోయాడు, ఆయన మాట్లాడుతూ ‘ చిరంజీవి మనం వచ్చే వారం కలుద్దాం అనుకున్నాం , అప్పటి లోపు నువ్వు పూర్తి కోలుకుంటావు అని నేను బలంగా నమ్ముతున్నాను, జీవితం లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నీకు ఈ తుచ్ఛమైన కరోనా ని ఎదురుకోవడం ఒక్క లెక్క కాదు, నువ్వు తొందరగా కోలుకోవాలి అని నేను ఆ షిరిడి సాయి బాబా కి పూజలు చెయ్యడం మొదలుపెడుతాను, గెట్ వెల్ సూన్ మై డియర్ ఫ్రెండ్, కోట్లాది మంది అభిమానుల చల్లని దీవెనెలు నీ వెంట ఉన్నాయి, కరోనా కాలం లో ఎంతో మందికి సహాయం చేసావు ,ఆ బాబా ఎప్పుడు నీతోనే ఉంటాడు’ అంటూ మోహన్ బాబు ఎంతో బావోద్వేగంగా మాట్లాడాడు, మోహన్ బాబు మరియు చిరంజీవి ఎలాంటి స్నేహితులు అనే సంగతి మన అందరికి తెలిసిందే, టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ అని ఇండస్ట్రీ లో అందరూ అనే సంగతి మన అందరికి తెలిసిందే.

ఈ కరోనా కష్ట కాలం లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరైనా విపరీతంగా కస్టపడి పేద సినీ కార్మికుల ఆకలి తీర్చారు అంటే అది మన మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అని చెప్పాలి, కరోనా గురించి మరియు ప్లాస్మా డొనేషన్ గురించి చిరంజీవి ప్రజల్లో చైతన్యం రప్పించేందుకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసాడో మన అందరికి తెలిసిందే, అలాంటి మెగాస్టార్ చివరంజీవి గారికి కరోనా రావడం అనేది మన అందరం చేసుకున్న దురదృష్టం అనే చెప్పాలి, సినిమా ఇండస్ట్రీ ఆరు నెలలు పైగా మూత పడి ఎంతోమంది ఉపాధి లేక రోడ్డున పడుతున్న సమయం లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ మొత్తం తిరిగి షూటింగ్స్ ప్రారంబించుకునే పరిస్థితి వచ్చింది అంటే అది మెగాస్టార్ చిరంజీవి కృషి ఫలితమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఇది ఇలా ఉండగా ఇటీవల కాలం లో ఆయన అక్కినేని నాగార్జున తో కలిసి తెలంగాణ సీఎం కెసిఆర్ తో మీటింగ్ కోసం వెళ్లారు, ఇన్ని రోజుల తర్వాత చిరు బయటకి రావడం ఇదే తొలిసారి,దాని వల్ల ఆయనకీ కరోనా సోకిందా అని అభిమానులు సందేహపడుతున్నారు, ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకొని మన ముందుకి రావాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడుడిని కోరుకుందాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *