చిరంజీవి ప్రస్తుత పరిస్థితి పై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు

By | November 11, 2020

కరోనా మహమ్మారి దాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు ఎలా తల్లడిల్లిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎంతో మంది పేద ప్రజల బ్రతుకుల్లో చీకటిని నింపిన ఈ మహమ్మారి దాటి నుండి ఇప్పటికి ఎవ్వరు కోలుకోలేక ఉన్నారు, సామాన్య మధ్య తరగతి కుటుంబాలు కరోనా సోకి దానికి సరైన చికిత్స చేయించుకోలేక చనిపోతుండడం మన అందరం చూసాము, కానీ వేల కోట్ల రూపాయలకు అధిపతులు అయినా ఎంతో మంది ప్రముఖ పారిశ్రామిక వెతలు , రాజకీయ నాయకులూ మరియు సినీ ప్రముఖులు కూడా ఈ కరోనా మహమ్మారి భారిన పడి ప్రాణాలను విడుస్తున్నారు అంటే ఇది ఎంత డేంజరస్ వైరస్ అనేది మన అందరం అర్థం చేసుకోవచ్చు, ఇటీవల కాలం లో గాన గంధర్వుడు ఎస్ పీ బాల సుబ్రహ్మణ్యం గారు కరోనా భారిన పడి తన ప్రాణాలను విడిచిన సంగతి మన ఘటన మన అందరిని ఎలా దిగ్బ్రాంతికి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ తర్వాత ప్రముఖ హీరో రాజశేఖర్ కూడా కరోనా భారిన పడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది, ఇప్పుడు లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా భారిన పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిరంజీవి అభిమానులకు గుండె ఆగిపొయ్యెలా చేసింది.

ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్య పరిస్థితి పై ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ నాన్న గారికి కరోనా సోకింది అనే వార్త బయటకి వచ్చినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన కోట్లాది మంది అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, కానీ నాన్న గారికి కరోనా ప్రారంభ దశలోనే మేము కనుక్కోగలిగాము, ఆయనకి ఇప్పటి వరుకు కరోనా తాలూకు లక్షణాలు ఏవి కూడా కనపడలేదు, ప్రస్తుతానికి ఆయన ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ అయ్యి ఉన్నారు, అభిమానులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అతి త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యం తో మన ముందుకి వస్తారు, ఆచార్య షూటింగ్ చెయ్యడానికి ముందు గా మా చిత్రం యూనిట్ కి మొత్తం కరోనా టెస్టులు చేయించాల్సి వచ్చింది , ఈ టెస్టులలో నాన్న గారికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది’ అంటూ రామ్ చరణ్ ఈ సందర్భం గా అభిమానులకు తెలిపారు, ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటూ బిజీ గా ఉంటున్న సంగతి మన అందరికి తెలిసిందే, చిరంజీవి కి కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడం తో ఆయన తన షూటింగ్ పార్ట్ ని క్యాన్సిల్ చేసుకొని ఇంట్లోనే ఉంటున్నారు.

ఈ కరోనా కష్ట కాలం లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరైనా విపరీతంగా కస్టపడి పేద సినీ కార్మికుల ఆకలి తీర్చారు అంటే అది మన మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అని చెప్పాలి, కరోనా గురించి మరియు ప్లాస్మా డొనేషన్ గురించి చిరంజీవి ప్రజల్లో చైతన్యం రప్పించేందుకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసాడో మన అందరికి తెలిసిందే, అలాంటి మెగాస్టార్ చివరంజీవి గారికి కరోనా రావడం అనేది మన అందరం చేసుకున్న దురదృష్టం అనే చెప్పాలి, సినిమా ఇండస్ట్రీ ఆరు నెలలు పైగా మూత పడి ఎంతోమంది ఉపాధి లేక రోడ్డున పడుతున్న సమయం లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ మొత్తం తిరిగి షూటింగ్స్ ప్రారంబించుకునే పరిస్థితి వచ్చింది అంటే అది మెగాస్టార్ చిరంజీవి కృషి ఫలితమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఇది ఇలా ఉండగా ఇటీవల కాలం లో ఆయన అక్కినేని నాగార్జున తో కలిసి తెలంగాణ సీఎం కెసిఆర్ తో మీటింగ్ కోసం వెళ్లారు, ఇన్ని రోజుల తర్వాత చిరు బయటకి రావడం ఇదే తొలిసారి,దాని వల్ల ఆయనకీ కరోనా సోకిందా అని అభిమానులు సందేహపడుతున్నారు, ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకొని మన ముందుకి రావాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడుడిని కోరుకుందాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *