డిశ్చార్జ్ అయ్యాక రాజశేఖర్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

By | November 13, 2020

ఇటీవల టాలీవుడ్ కి చెందిన ప్రముఖ సినీ హీరోలు మరియు హీరోయిన్లకు కరోనా సోకినా సంగతి మన అందరికి తెలిసిందే, ఎన్ని జాగ్రత చర్యలు తీసుకున్న కూడా ఈ కరోనా మహమ్మారి దాటి నుండి తప్పించుకోవడం చాల కష్ట తరం అవుతుంది, ఈ మహమ్మారి కి కొంతమంది దిగ్గజాలు నేలరాలుతుండగా మరికొంత మంది పోరాడి తమ ప్రాణాలను కాపాడుకున్నారు, గాన గంధర్వుడు ఎస్ పీ బాల సుబ్రహ్మణ్యం గారికి కరోనా సోకి చాలా సీరియస్ అయ్యి ఆయన సుమారు రెండు నెలలకి పైగా కరోనా మహమ్మారి తో పోరాడి చివరికి తన ప్రాణాలను విడిచిన ఘటన మన అందరిని ఎంత శోకం లోకి ముంచేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ ఘటన కి ముందు చాల మంది సినీ నటులకు కరోనా సోకినా వాళ్ళు ఆ తర్వాత చాల తేలికగానే కోలుకున్నారు, ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అలాగే కోలుకుంటారు అని అందరూ ఆశించారు, కానీ మన దురదృష్టం కొద్దీ ఆయన మనల్ని విడిచి తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయారు, ఈ సంఘటన జరిగి కొద్దీ రోజులు కూడా కాకముందే మరో సినీ నటుడు రాజశేఖర్ కి కూడా కరోనా సోకి హాస్పిటల్ పాలైన సంగతి మన అందరికి తెలిసిందే.

రాజశేఖర్ పరిస్థితి కూడా మొదట్లో చాల విషమంగా ఉండింది, ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అందరూ కూడా చాలా ఆందోళనకి గురి అయ్యారు, సుమారు రెండు వారాల పాటు కరోనా తో పోరాడి జయించి ఇటీవల హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు, రాజశేఖర్ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు, ఆయన మాట్లాడుతూ ‘ మీ అందరి దీవెనలు ప్రార్థనలు ఈరోజు నన్ను మీ ముందుకి వచ్చేలా చేసింది, దాదాపు చావుకి దగ్గరకి వెళ్లి వచ్చా, ఇక్కడ డాక్టర్లు అందించిన అద్భుత్త్వమైన చికిత్స మరియు నా ఆత్మ విశ్వాసమే ఈరోజు నన్ను కాపాడింది, ఒక్కసారి కాదు ,రెండు సార్లు చావుని తప్పించుకొని మీ దీవెనలు వల్ల ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను, నేను న జీవితం లో ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే అది నా అభిమానులకే,ఈ కష్ట సమయం లో మాకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’ అంటూ ఎంతో బావోద్వేగంగా మాట్లాడారు రాజశేఖర్.

ఇది ఇలా ఉండగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కరోనా సోకినా సంగతి మన అందరికి తెలిసిందే, ఈ వార్త బయటకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మెగా అభిమానులు ఒక్కసారిగా తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి అయ్యారు, అయితే చిరంజీవి కి ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడం తో ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి ఆయన చాల స్పీడ్ గా కోలుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం, అతి త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యం తో మన ముందుకి రాబోతున్నారు , మెగా ఫామిలీ సన్నిహిత వర్గాల నుండి వస్తున్న శుభ వార్త, మరో పక్క ఆచార్య షూటింగ్ ని కూడా ప్రారంభించమని కొరటాల శివ కి చిరంజీవి ఆదేశాలు జారీ చేసాడు అట,ఈరోజు హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది, చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరించడం ప్రారంభించారు, మెగాస్టార్ చిరంజీవి త్వరగా కొరోనా నుండి కోలుకొని మన ముందుకి రావాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *