శోభన్ బాబు సతీమణి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

By | November 11, 2020

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోలు ఉన్న కొంత మంది హీరోలు మాత్రం ఎన్ని జెనెరేషన్లు మారిన మర్చిపోలేని విధంగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి ఉంటారు, వారిలో ఒక్కరు శోభన్ బాబు గారు, ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ తర్వాత వాళ్ళ స్థాయి లో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఏకైక హీరో శోభన్ బాబు, అప్పట్లో శోభన్ బాబు సినిమా వస్తే తెహట్రెస్ వైపు ఫామిలీ ఆడియన్స్ బారులు తీసేవారు, ఇప్పుడు ఏ హీరో అయినా ఫామిలీ ఆడియన్స్ లో క్రేజ్ సంపాదిస్తే వారిని శోభన్ బాబు తో పోల్చేవారు, ఆ స్థాయిలో అప్పట్లో ఆయన క్రేజ్ ఉండేది, సోగ్గాడిగా మంచి గుర్తింపు రప్పించుకున్న శోభన్ బాబు పక్కన హీరోయిన్ గా నటించడానికి అప్పట్లో టాప్ హీరోయిన్స్ అందరూ ఎగబడేవారు, ఇంతతి బ్రాండ్ ఇమేజ్ ఉన్న శోభన్ బాబు గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

శోభన్ బాబు గారి అసలు పేరు ఉప్పు శోభన చలపతి రావు,ఈయన 1959 వ సంవత్సరం లో భక్త శబరి అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు, ఆయన తొలి సినిమా ఇదే అయినా వెండితెర కి పరిచయం అయ్యింది మాత్రం దైవబలం అనే సినిమా ద్వారా, సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందు శోభన్ బాబు గారు నాటకాల ప్రదర్శనల ద్వారా బాగా పాపులర్ అయ్యారు, ఆ తర్వాత మెల్లిగా ఆయనకీ సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అతి తక్కువ కాలం లోనే ఎన్టీఆర్ మరియు ఏ ఎన్ ఆర్ స్థాయి స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నాడు, సుమారు రెండు వందల సినిమాలకి పైగా నటించిన శోభన్ బాబు వయస్సు మీదకి వచ్చే సరికి సినిమాలు చెయ్యడం మానేసి , చెన్నై లో స్థిర పడ్డాడు, వయసు మీద పడిన కూడా ఆయన స్టార్డం మరియు క్రేజ్ లో ఎలాంటి మార్పు లేకపోయినా, ట్యానని ప్రేక్షకులు అందరూ ఒక్క అందగాడిగా ఎంతో ఆదరించారు అని , ఇప్పుడు వయసు అయిపోయిన మొహం తో వాళ్ళ ముందుకి వచ్చి నిరాశపరచలేను అని ఆయన అప్పట్లో ఒక్క పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు, శోభన్ బాబు గారు చివరిసారిగా హీరో గా కనిపించిన సినిమా 1996 వ సంవత్సరం లో వచ్చిన హలో గురు అనే సినిమా, ఆ సినిమా తర్వాత శోభన్ బాబు గారు మీడియా ముందుకి కూడా రాలేదు.

ఇక శోభన్ బాబు వ్యక్తిగత విషయానికి వస్తే 1958 వ సంవత్సరం లో సంత కుమారి అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు, ఈయనకి ముగ్గురు కూతుర్లు మరియు ఒక్క కొడుకు ఉన్నాడు, కూతుర్ల పేర్లు మృదుల , ప్రశాంతి మరియు నివేదిత కాగా కొడుకు పేరు కరుణ శేషు , శోభన్ బాబు ఎంత పెద్ద హీరో అయినా తన కూతుర్లను కానీ కొడుకుకి కానీ సినీ రంగం ఛాయలు కూడా వాళ్ళ మీద పడడానికి ఇష్టపడలేదు, కూతురులందరిని ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు ఇచ్చి పెళ్లి చేసి , కొడుకుని వ్యాపార పరంగా స్థిరపడేలా చేసాడు, ఇక శోభన్ బాబు గారి భార్య శాంత కుమారి శోభన్ బాబు గారి గురువు గారి కూతురు, సినీ రంగం లోకి రాకముందే ఈమెని శోభన్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చాక చెన్నై లో స్థిర పడి ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్న శోభన్ బాబు గారు 2008 మార్చి 8 వ తేదీన గుండెపోటు తో మరణించాడు, ఆయన లేని లోటు తెలుగు సినిమాకి ఎవ్వరు పూడవలేనిది అని చెప్పొచ్చు, ఆయన బౌతికంగా మన మధ్య లేకపోయినా , ఆయన చేసిన సినిమాల ద్వారా ఎప్పటికి చిరస్థాయిలో మన హృదయాల్లో ఉంటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *